English | Telugu
విడాకుల వార్తలపై నయనతార షాకింగ్ రియాక్షన్!
Updated : Jul 10, 2025
నయనతార, విఘ్నేష్ శివన్ విడాకులు తీసుకోబుతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. "స్టుపిడ్ ను పెళ్లి చేసుకుంటే.. పెళ్లి అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది." అంటూ నయనతార సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసేసింది. అయితే అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అయింది. దాంతో నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలపై తాజాగా నయనతార పరోక్షంగా స్పందించింది.
విఘ్నేష్ శివన్ తో కలిసి ఉన్న ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన నయనతార.. "మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే" అని రాసుకొచ్చింది. ఇటీవల వచ్చిన విడాకుల న్యూస్ కి అది కౌంటర్ అని అర్థమవుతోంది. మొత్తానికి తాజా పోస్ట్ తో విడాకుల వార్తల్లో నిజం లేదని చెప్పేసింది నయనతార.
నయనతార, విఘ్నేష్ శివన్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. నయనతార తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది. తన భర్తతో, పిల్లలతో దిగిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాంటి నయనతార.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో "స్టుపిడ్ ను పెళ్లి చేసుకుంటే.. పెళ్లి అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇప్పటికే మీ వల్ల చాలా ఫేస్ చేశాను." అని పోస్ట్ పెట్టడంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇక తన తాజా పోస్ట్ తో ఆ వార్తలకు చెక్ పెట్టింది.