English | Telugu

విశ్వంభర విఎఫ్ఎక్స్ పై చిరంజీవి కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నుంచి 'భోళా శంకర్'(Bhola Shankar)మూవీ వచ్చి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అవుతుంది. దీంతో అప్ కమింగ్ మూవీ 'విశ్వంభర'(Vishwambhara)కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'బింబిసార'(Bimbisara)ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకుడు కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్, 'రాముడు'పై వచ్చిన సాంగ్ తో 'విశ్వంభర'పై అంచనాలు పెరగడంతో పాటు కథ పై కూడా ఆసక్తిని కలిగిస్తుంది.

నిజానికి 'విశ్వంభర' ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కావాల్సి ఉంది. కానీ 'గేమ్ చేంజర్'(Game changer)వలన వాయిదా వేశారు. అదే సమయంలో 'విశ్వంభర'కి అత్యంత కీలకమైన 'గ్రాఫిక్స్' బాగా రాలేదని, చిరంజీవి ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఆ వార్త నిజమనేలా రీసెంట్ గా దర్శకుడు వశిష్ట సుమారు నలభై ఐదు నిమిషాల నిడివితో ఉన్న 'విఎఫ్ఎక్స్' ఫుటేజ్ ని పూర్తి చేసి చిరుకి చూపించినట్టుగా తెలుస్తుంది. వాటిని చూసిన చిరు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసాడని, బ్యాలన్స్ గా ఉన్న స్పెషల్ సాంగ్ కి డేట్స్ ఇచ్చినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్.

'విశ్వంభర'ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని, చిరు కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. త్రిష(Trisha),నా సామిరంగ ఫేమ్ ఆషికా రంగనాధ్, ఈషా చావ్లా, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి(keeravani)సంగీత దర్శకుడు కాగా సెప్టెంబర్ 18 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.