English | Telugu

నాన్-థియేట్రికల్ బిజినెస్‌ తో నారా రోహిత్ సంచలనం!

కరోనా తరువాత నాన్-థియేట్రికల్ బిజినెస్‌ పై మేకర్స్ ఎక్కువ ఆధారపడుతున్నారు. అయితే ఈమధ్య నాన్-థియేట్రికల్ బిజినెస్ అనేది చాలా కష్టమైపోయింది. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో నారా రోహిత్ నటిస్తున్న 'సుందరకాండ' మూవీ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

'సుందరకాండ' సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో రూ. 12 కోట్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ రూ.9 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్‌ రూపంలో మరో రూ. 3 కోట్లు వచ్చాయి. దీంతో నాన్-థియేట్రికల్ ద్వారా ఏకంగా రూ.12 కోట్లు సాధించింది సుందరకాండ.

ఈ సినిమాను హాట్ స్టార్ కు చెందిన మూడు టీమ్స్ చూసి మరీ కంటెంట్ బాగా నచ్చడంతో మంచి రేటుకు తీసుకున్నారట. దీంతో సుందరకాండ కంటెంట్ ఆ రేంజ్ లో ఉందా అనే ఆసక్తి నెలకొంది.

నారా రోహిత్ కు 20వ చిత్రం కాగా, ఈ సినిమా ద్వారా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి దీనిని నిర్మిస్తున్నారు. సుందరకాండ ఆగస్టు 27న విడుదల కానుంది.