English | Telugu

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌రెడ్డి వంగా!

గత ఏడాది రిలీజ్‌ అయి సంచలనం సృష్టించిన ‘కల్కి 2898ఎడి’ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాల్లో మొదట మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరోపక్క హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌ కూడా జరుగుతోంది. ఈ సినిమాలు ఇలా ఉంటే.. అందరి దృష్టీ సందీప్‌ వంగా కాంబినేషన్‌లో చేయబోతున్న ‘స్పిరిట్‌’పైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి బయట వినిపిస్తున్న వార్తలే తప్ప అఫీషియల్‌గా ఏదీ బయటికి రాలేదు. తాజాగా దర్శకుడు సందీప్‌ ‘స్పిరిట్‌’కి సంబంధించి ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చారు.

విజయ్‌ దేవరకొండతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చేసిన సందీప్‌.. ఇప్పుడు విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌’ ప్రమోషన్స్‌లో అతనికి హెల్ప్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్పిరిట్‌ మూవీ అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. సెప్టెంబర్‌ చివరి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది స్పిరిట్‌ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అర్జున్‌రెడ్డి, యానిమల్‌ చిత్రాలతో ప్రేక్షకులకు ఒక పవర్‌ఫుల్‌ కిక్‌ ఇచ్చిన సందీప్‌.. ప్రభాస్‌తో చేసే స్పిరిట్‌తో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే స్పిరిట్‌ కూడా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

రాజాసాబ్‌, ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాలే కాకుండా సలార్‌2, కల్కి2 చిత్రాలు కూడా ప్రభాస్‌ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత సలార్‌2 గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇక కల్కి2 గురించి ఎలాంటి న్యూస్‌ బయటికి రాలేదు. దానికి సంబంధించి ఎలాంటి వర్క్‌ జరుగుతోంది అనే విషయంలో కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఏది ఏమైనా సినిమాలు పూర్తి చేసే విషయంలో ప్రభాస్‌ ఎంతో దూకుడుగా ఉన్నాడని మాత్రం అర్థమవుతోంది. తను కమిట్‌ అయిన సినిమాలను జెట్‌ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో డైరెక్టర్లకి తన ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నారని మాత్రం అర్థమవుతోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.