English | Telugu
'ఎన్టీఆర్ 30'కి పవర్ స్టార్ టైటిల్!
Updated : May 15, 2023
'భీమ్లా నాయక్' వచ్చినప్పటి నుంచి కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను 'దేవర' అని పిలుస్తున్నారు. అంతేకాదు పవన్ నటిస్తున్న 'వినోదయ సిత్తం' రీమేక్ కి కూడా అదే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఖరారైనట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ తన 30 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటిసున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని రివీల్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'దేవర' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. 'దేవర'తో మరికొన్ని టైటిల్స్ ని కూడా పరిశీలించారట. అయితే కథ పరంగా సినిమాకి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని, పైగా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఈ టైటిల్ సెట్ అవుతుందన్న ఉద్దేశంతో మూవీ టీం 'దేవర' టైటిల్ కి ఓటేసినట్లు వినికిడి. మరి ఈ వార్తల్లో నిజమెంతో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది.