English | Telugu

'రుద్ర కాళేశ్వర్ రెడ్డి'గా వైష్ణవ్ తేజ్.. ఊర మాస్ గ్లింప్స్!

'రుద్ర కాళేశ్వర్ రెడ్డి'గా వైష్ణవ్ తేజ్.. ఊర మాస్ గ్లింప్స్!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ యాక్షన్ ఫిల్మ్ కి 'ఆదికేశవ' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సోమవారం నాడు చిత్ర బృందం ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.

వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. 'ఆదికేశవ' గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్ మనకు 'రుద్ర కాళేశ్వర్ రెడ్డి'గా పరిచయం అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూడగా, రుద్ర వారిని అడ్డుకుంటాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది. రుద్రగా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూపించాడు. లుక్స్, యాక్షన్ తో అదరగొట్టాడు. 

ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా డడ్లీ, ఎడిటర్ గా నవీన్‌ నూలి వ్యవహరిస్తున్నారు. జూలై నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.