English | Telugu

ప్రమాదం జరిగిన రోజు మంచు లక్ష్మి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో లండన్ వెళ్లిందట

ప్రమాదం జరిగిన రోజు మంచు లక్ష్మి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో లండన్ వెళ్లిందట

 

మంచు మోహన్ బాబు(Manchu Mohanbabu)వారసురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి(Manchu lakshmi)సుదీర్ఘ కాలం నుంచి విభిన్నమైన క్యారక్టర్లని పోషిస్తు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్(Ahmedabad)లో ఎయిర్ ఇండియా సంస్థకి చెందిన విమాన ప్రమాదం జరిగిన రోజే మంచు లక్షి తమ కుమార్తె తో కలిసి లండన్(LOndon)వెళ్ళింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.

ఈ మొత్తం విషయంపై మంచులక్ష్మి రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతు  విమాన ప్రమాదంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జీవితంలో ఎప్పుడు ఏం  జరుగుతుందో తెలియదనటానికి, మన ప్రాణాలు క్షణాల్లో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. మృతి చెందిన కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియయచేస్తున్నాను. నేను మా అమ్మాయి ప్రమాదం జరిగిన రోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ముంబై నుంచి లండన్ కి ప్రయాణం చేసాం. దేవుడి దయ వల్ల మేము సేఫ్ గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ప్రమాద విషయం తెలిసి ఉలిక్కిపడ్డాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం  చాలా మంది ఫోన్లు, మెసేజెస్ చేస్తున్నారని సదరు వీడియోలో చెప్పుకొచ్చింది.