English | Telugu
27న విడుదలవుతున్న ఆటోనగర్ సూర్య
Updated : Jun 16, 2014
మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై, దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న ఆటోనగర్ సూర్య సినిమా జూన్ 27న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత అచ్చిరెడ్డి ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపి, అనుకున్న తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఏమాయ చేశావే, మనం చిత్రాలు విజయం సాధించాయి. ఈ సారి కూడా వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అయి, వీరిద్దరూ హ్యాట్రిక్ విజయం అందుకుంటారాని ఆశిస్తున్నారు. చిత్రానికి అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించామని, ప్రేక్షకులు తప్పక ఆదరించి, సూపర్ హిట్ చేస్తారనే నమ్మకం వుందని అచ్చిరెడ్డి అన్నారు.
వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న డైరెక్టర్ దేవకట్ట. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం పట్ల ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు నెలకొని వున్నాయి.