English | Telugu
కావాలా సాంగ్‌కు స్టెప్పులేసిన రమ్యకృష్ణ
Updated : Jul 30, 2023
జైలర్ వైరల్ సాంగ్ కావాలా... కు స్టెప్పులేశారు రమ్యకృష్ణ. జైలర్ ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ వేడుక కోసం చక్కగా రెడీ అయ్యారు రమ్యకృష్ణ. తన వ్యానిటీ వ్యాన్‌లో కావాలా పాటకు అద్దిరిపోయే స్టెప్పులేశారు. ఆమె ఆ పాటకు వేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వారెవా... ఇరగదీశారు మేడమ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
తన ముగ్గురు స్టాఫ్‌తో కలిసి వ్యానిటీ వ్యాన్‌లో స్టెప్పులేశారు రమ్యకృష్ణ. ఫుల్ బ్లాక్ డ్రస్‌లో, పర్ఫెక్ట్ గా కావాలా హుక్ స్టెప్‌ని మ్యాచ్ చేశారు. 52 ఏళ్ల వయసులో ఈ రేంజ్ గ్లామర్‌ని, పిక్చర్ పర్ఫెక్ట్ స్టెప్పులను ఆమె నుంచి ఎవరూ ఊహించరని అంటున్నారు రమ్యకృష్ణ ఫ్యాన్స్.
రజనీకాంత్, తమన్నా భాటియా నటించిన సినిమా జైలర్. ఈ సినిమా ఆడియో వేడుక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. స్టార్ స్టడడ్ ప్రోగ్రామ్‌గా ఎలివేట్ అయింది. ఈ స్టేజ్ మీద తమన్నా కావాలా పాటకు పెర్ఫార్మ్ చేశారు.
జైలర్ సాంగ్ కావాలాను శిల్పా రావు, అనిరుద్ రవిచంద్రన్ పాడారు. ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫిదా అవుతున్నారు ఈ పాటకు.
జైలర్ సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన బీస్ట్ మూవీ ఫ్లాప్ కావడంతో వెంటనే, ఈ సినిమాకు అతన్ని తీసేయమని రజనీకాంత్‌కి పలువురు సలహా ఇచ్చారట. అయితే, సన్ పిక్చర్స్ ధైర్యం చేసి ముందుకు రావడంతో సినిమా పట్టాలెక్కిందట.
ఈ చిత్రంలో ముత్తువేల్ పాండ్యన్‌గా నటించారు రజనీకాంత్. డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ విలన్‌గా నటించారు. రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ ఇతర పాత్రల్లో నటించారు. జాకీ ష్రాఫ్, మోహన్‌లాల్ స్పెషల్ రోల్స్ చేశారు.