English | Telugu

ఎన్టీఆర్ సమాధి వద్ద భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్ 

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ, మాజీముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు(NTR) ఈ రోజు తన 102 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో ఆయన జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ, ఆ మహానుభావుడి పట్ల తమకున్న ఆరాధ్య భావనని చాటి చెప్తున్నారు. అభిమానులకైతే పండుగ రోజని చెప్పవచ్చు.

ఇక హైదరాబాద్ సెంట్రల్ సెక్రటేరియట్ దగ్గర ఉన్న'ఎన్టీఆర్ దివ్య సమాధి'ని ఆయన మనవడు ఎన్టీఆర్ దర్శించుకోవడం జరిగింది. రాగానే తొలుత దివ్య సమాధి చుట్టూ తిరిగిన ఎన్టీఆర్ అనంతరం సమాధికి పూలమాలలు వేసి తన శిరస్సు వంచి నమస్కరించాడు. అనంతరం సమాధి వద్దనే కాసేపు కూర్చున్నాడు. ఆ సమయంలో తాతని తలుచుకుంటూ దుఃఖంతో వస్తున్న కన్నీళ్లని ఒదిమి పట్టుకున్నట్టుగా అందరకి కనిపించింది. ఎన్టీఆర్ వెంట సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఉండి తన తాతకి నివాళులు అర్పించాడు.

ఎన్టీఆర్ రాకతో ఆ ప్రాంగణం మొత్తం అభిమానులతో నిండిపోయింది. జై ఎన్టీఆర్ అనే నినాదాలు మిన్నంటాయి.