English | Telugu

సందీప్ రెడ్డికి మెగా కౌంటర్ ఇచ్చిన దీపికా పదుకునే!

'దీపికా పదుకునే'(Deepika Padukone)హిందీ చిత్ర సీమలో సుమారు రెండు దశాబ్దాల నుంచి,విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతు వస్తుంది. గత ఏడాది ప్రభాస్ తో కలిసి 'కల్కి 2898 ఏడి' ద్వారా తెలుగు ప్రేక్షకులని అలరించింది. అల్లుఅర్జున్(Allu Arjun)అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న నూతన చిత్రంలో కూడా దీపికా చెయ్యబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా దీపికా ఒక ఫ్యాషన్ షో లో పాల్గొని సెంటర్ ఆఫ్ యాక్షన్ గా మారింది. షో అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతు 'లైఫ్ లో మనం బ్యాలెన్స్ డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. అందుకే నేను నిజాయితీకి ప్రాధాన్యమిస్తాను. క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మనసు చెప్పేదే వింటాను. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకొని ఎలాంటి పరిస్థితులని అయినా ఎదుర్కుంటానని చెప్పుకొచ్చింది.

ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga)కాంబోలో తెరకెక్కబోయే 'స్పిరిట్'(Spirit)లో తొలుత హీరోయిన్ గా దీపికా పదుకునే ని అనుకున్నారు. కానీ సందీప్ రెడ్డి ఆమెని తొలగించి యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ'(Tripti Dimri)ని తీసుకున్నాడు. దీపిక పెట్టే కండిషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెని తొలగించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సందీప్ మీద కోపంతో స్పిరిట్ కథని దీపికా లీక్ చేసిందని, త్రిప్తి ని కూడా తక్కువ చేసి మాట్లాడిందనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సందీప్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తు నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉండగా ఆమె కథ ఎలా బయటకి చెప్తుంది. ఒక యంగ్ నటిని కూడా కించపరుచుతున్నారు. ఇదేనా మీ ఫెమినిజం. మీరేం చేసినా నాకు ఫరక్ పడదు. పిల్లి స్థంబాన్ని గీరడం లాంటిదని ట్వీట్ వేశాడు. ఈ నేపథ్యంలో దీపికా మాట్లాడిన నిజాయితీ మాటలు సందీప్ రెడ్డి ని ఉద్దెశించి చేసినవనే చర్చ బాలీవుడ్ లో జరుగుతుంది.