English | Telugu

వాళ్లు సర్వనాశనం అయిపోతారంటున్న ఇంద్రజ.. వాళ్ళు వీరే  

-బాలకృష్ణ తో జోడి కట్టిన రికార్డు
-ఇంద్రజ ఏం చెప్తుంది
-సదరు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా 'ఇంద్రజ'(Indraja)సినీ జర్నీకి ప్రత్యేమైన గుర్తింపు పొందింది. ఇండస్ట్రీ లో కి అడుగుపెట్టిన కొంత కాలానికే గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna) సరసన నటించే అవకాశాన్ని సంపాదించిందంటే ఇంద్రజ నటప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు . సూపర్ స్టార్ కృష్ణ(Krishna)తో జోడి కట్టిన రికార్డు కూడా ఇంద్రజ సొంతం. తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్న ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమవుతున్న'శ్రీదేవి డ్రామా కంపెనీ' కి జడ్జి గా వ్యవహరిస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. రీసెంట్ గా సదరు షో కి సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా ఇంద్రజ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.


ఇంద్రజతో షో యాంకర్ మాట్లాడుతు 'ఈ తరం యువత ప్రేమ, బ్రేకప్‌ ని చాలా ఈజీగా తీసుకుంటుందనే ప్రశ్నని సంధించింది. అప్పుడు ఇంద్రజ మాట్లాడుతు ఒక మహిళ ప్రసవ సమయంలో అత్యంత తీవ్రమైన నొప్పిని భరిస్తుంది.ప్రేమలో మోసపోతే అదే స్థాయిలో బాధ ని అనుభవిస్తారు. ఆ మోసం చేసింది ఆడైనా, మగైనా సరే వారికి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు. ఇప్పటి జనరేషన్ ప్రేమని తేలిగ్గా తీసుకొని బ్రేకప్ చెప్పేస్తుంది. అయినా మనిషి పుట్టింది ప్రేమించడానికే కాదు, సాధించడానికి కూడా అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


also read:స్పీడ్ పెంచిన చిరంజీవి.. సెకండ్ సాంగ్ లిరిక్స్ విని ఫీల్ అవ్వడం మానండి


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.