English | Telugu
దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు
Updated : Jan 20, 2025
సుదీర్ఘ కాలం నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటూ ఎన్నో విజయవంతమైన చిత్రాలని ప్రేక్షకులకి అందిస్తూ వస్తున్నారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి రెండు విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులకి అందించారు. వీటిల్లో సంక్రాంతికి వస్తున్నాం అయితే రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకు పోతుంది. త్వరలో 200 కోట్ల క్లబ్ లోకి కూడా చేరబోతోంది. (Dil Raju)
ఇప్పుడు హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్ వంటి ఏరియాల్లో అధికారులు 55 బృందాలుగా ఏర్పడి సోదాలు జరుపుతున్నారు. దిల్ రాజు, కుటుంబసభ్యుల ఇళ్లు, ఆఫీసుల తో పాటు, దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా ఐటీ సోదాలు జరగలేదు. అలాంటిది ఇప్పుడు దిల్ రాజు ఇంట్లో జరగడం ఇండస్ట్రీ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. దిల్ రాజు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే.