English | Telugu

పుష్ప 2 లోని చాలా సీన్స్ మా లైఫ్ లో జరిగినవే..ఇదెక్కడి ట్విస్ట్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)వన్ మాన్ షో పుష్ప 2(Pushpa 2)సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. 1800 కోట్ల రూపాయిల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరికొన్ని రోజుల్లో 50 రోజుల వేడుకని జరుపుకోనుంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలోని చాలా సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ లో అల్లు అర్జున్,రష్మిక వచ్చిన సీన్స్ అయితే మెస్మరైజ్ చేశాయని చెప్పవచ్చు.

ఇక సుకుమార్ కూతురు సుకృత వేణి కీలక పాత్రలో నిర్మాణం జరుపుకున్న'గాంధీ తాత చెట్టు' ఈ నెల 24 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ వైఫ్ తబిత పుష్ప 2 లోని సీన్స్ గురించి మాట్లాడుతు వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ చాలా వరకు తమ నిజ జీవితంలో జరిగినవే.వాటినే సుకుమార్ కాపీ చేసి పుష్ప 2 లో పెట్టారని చెప్పుకొచ్చింది.ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

గాంధీ తాత చెట్టు ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా సుకుమార్ కథ ని అందించడం జరిగింది.బాను ప్రకాష్,ఆనంద్ చక్రపాణి,రాగ్ మయూర్,నేహాల్ ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.