English | Telugu

చిరంజీవి ఫేక్ వీడియోలు.. సజ్జనార్ మాస్ వార్నింగ్..!

- డీప్ ఫేక్ బారిన పడ్డ చిరంజీవి
- ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్
- సైబర్ కేటుగాళ్లపై చిరు న్యాయ పోరాటం
- చిరంజీవి ఫిర్యాదుపై సజ్జనార్ రియాక్షన్

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) సహాయంతో కొందరు సైబర్ కేటుగాళ్లు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు, వీడియోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను, న్యాయస్థానాన్ని చిరంజీవి ఆశ్రయించారు. (Megastar Chiranjeevi)

చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుపై తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. చిరంజీవి డీప్ ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. చిరంజీవి యొక్క ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు. ఇలాంటి డీప్ ఫేక్ సెలబ్రిటీ కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

Also Read: స్టార్ కిడ్ చేతికి విజయ్ చేయాల్సిన భారీ ప్రాజెక్ట్..!

గతంలో ఓ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి, వారిని పట్టుకున్నారు. ఏఐ రాకతో ఈ ఫేక్ ఫొటోలు, వీడియోల గోల మరింతగా పెరిగిపోయింది. దీంతో సినీ సెలబ్రిటీలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. సైబర్ కేటుగాళ్లు ఏఐ సహాయంతో చిరంజీవి ఫోటోలు, వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది గమనించిన చిరంజీవి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి తన ప్రతిష్టను దెబ్బతీశారని.. అట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొ న్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా.. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.