English | Telugu

వీరమల్లు బ్యానర్స్ చించివేత.. ఇది ఖచ్చితంగా వాళ్ల కార్యకర్తల పనే 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సుమారు మూడు సంవత్సరాల తర్వాత మరి కొద్దీ గంటల్లో సిల్వర్ స్క్రీన్ పై 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)గా అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా థియేటర్స్ దగ్గర అభిమానులు, సినీప్రేమికులతో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఈ రోజు జరిగే ప్రీమియర్ షో తో పాటు రేపటికి సంబంధించిన అన్ని షోస్ కి సంబంధించిన టికెట్స్ బుక్ అయిపోవడంతో, పవన్ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

రీసెంట్ గా కర్ణాటక(Karnataka)రాజధాని బెంగుళూరు(Bengaluru)నగరంలోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున బ్యానర్స్ ని ఏర్పాటు చేసారు. సదరు బ్యానర్స్ అన్ని తెలుగులో ఉండటంతో, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు అక్కడికి చేరుకొని వీరమల్లు బ్యానర్స్ కన్నడ భాషలో లేవని బ్యానర్స్ ని చించి వేయడం జరిగింది. కొంత మంది పవన్ అభిమానులు కూడా అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కర్ణాటక లో కొన్నిరోజుల నుంచి ఇతర భాషలకి సంబంధించిన బోర్డ్స్ కనిపిస్తే కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు తొలగిస్తూ వస్తున్నారు.