English | Telugu

ఆది 'గాలిపటం' ఫస్ట్ లుక్ రిలీజ్

ఆది హీరోగా నటిస్తున్న గాలిపటం చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వివి వినాయక్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఫస్ట్ లుక్ వివి వినాయక్ ఆవిష్కరించగా, సాయికుమార్ ఆయన సతీమణి సినిమా లోగోని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టీనా అఖివా, ప్రీతీ రానా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత సంపత్ నంది. యూత్‌కి కనెక్ట్ అయ్యే ఈ సబ్జెక్ట్ తనకెంతో నచ్చిందని, మిత్రులనీ ప్రొత్సాహించాలని ఈ చిత్ర నిర్మాణం చేపట్టినట్లు నిర్మాత సంపత్ నంది ఈ సందర్భంగా చెప్పారు. అలాగే కొత్త నటులను, టెక్నీషియన్స్‌ని పరిశ్రమకు పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు.
గాలిపటం హీరో ఆది తాను గతంలో చేసిన చిత్రాలకంటే ఈ సినిమా భిన్నంగా వుంటుందన్నారు. ఆయన తండ్రి సాయికుమార్ ఈ సినిమా ఒక సెన్సిబుల్ ప్రేమ కథ అని, నవీన్ చాలా చక్కగా చిత్రాన్ని నరేట్ చేస్తారని అన్నారు.