ఒకే వేదికపై జనార్దన మహర్షి రచించిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ!
ప్రముఖ రచయిత– దర్శకుడు జనార్దన మహర్షి రచించిన నాలుగు పుస్తకాలను హైదరాబాద్లో గురువారం విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సతీష్ వేగేశ్న ‘‘పరిమళాదేవి’’ పుస్తకాన్ని విడుదల చేయగా, ‘‘శుభలక్ష్మీ’’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేశారు.