English | Telugu
దేవర ముంగిట నువ్వెంత.. ఇదిరా మాస్ అంటే!
Updated : May 19, 2024
మాస్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) నుంచి సినిమా వస్తుందంటే ఏ రేంజ్ లో సందడి నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత ఆరేళ్ళలో ఎన్టీఆర్ నుంచి 'ఆర్ఆర్ఆర్' సినిమా మాత్రమే వచ్చింది. పైగా అది మల్టీస్టారర్. అందుకే తారక్ సోలో మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ 'దేవర' (Devara) అనే భారీ యాక్షన్ ఫిల్మ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆయనకు, మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్ తోడైతే ఇంకేమైనా ఉందా?. అందుకే 'దేవర' సాంగ్స్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గనివిధంగా దేవర మొదటి సాంగ్ ఉంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) కానుకగా ఒకరోజు ముందుగా 'దేవర' ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్'(Fear Song)ను విడుదల చేశారు. దేవర పాత్రను పరిచయం చేస్తూ.. "దేవర ముంగిట నువ్వెంత" అంటూ సాగిన ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ పవర్ ఫుల్ గా ఉంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సాంగ్ ని అనిరుధే పాడటం విశేషం. సంగీతంతోనే కాదు గాత్రంతోనూ మ్యాజిక్ చేశాడు.
ఇక లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన లుక్ కొత్తగా ఉంది. మొత్తానికి థియేటర్లో ఈ పాటతో పాటు సినిమా కూడా మాస్ ని ఉర్రూతలూగించేలా ఉంది.