English | Telugu

చిరంజీవి ట్వీట్ ప్రధాని మోదీ కోసమే..ఇక నెంబర్ వన్ అవ్వడమే లక్ష్యం 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)రీసెంట్ గా జూమ్ కాల్ లో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)నిర్వహించిన,వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (Waves ) లో పాల్గొనడం జరిగింది.


ఇప్పుడు ఈ విషయంపై చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు,వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(Waves )కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం మరియు ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి నా సూచనలు పంచుకోవడం నిజంగా ఒక విశేషం.మీ మెదడు నుంచి పుట్టిన,WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.సాఫ్ట్ పవర్ గా ప్రపంచంలోనే అతి త్వరలోనే సరికొత్త పుంతలు తొక్కుతు అత్యంత ఎత్తుకి ఎదుగుతుందని తెలిపాడు.

ఇక వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)అనేది మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్.ముఖ్యంగా ఇది భారతీయ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీపై దృష్టి సారిస్తుంది. ప్రకటనలు,గేమింగ్,కంటెంట్ ఉత్పత్తి, యానిమేషన్ మరియు సంగీతంలో అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఒక వేదికను కూడా అందిస్తుంది.కంటెంట్ సృష్టి,ఫైనాన్సింగ్‌లో వ్యూహాత్మక సహకారాలు,ప్రతిభ అంతరాలను పరిష్కరించడం, స్థానికీకరణ మరియు విలువైన IPలను సృష్టించి,పెట్టుబడులను ఆకర్షించడం,భారతదేశాన్ని ఒక ఆవిష్కరణ కేంద్రంగా,వినోదంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడమే Waves ప్రధాన లక్ష్యం.రజనీకాంత్,అమితాబచ్చన్,అమీర్ ఖాన్,ఏఆర్ రెహ్మాన్, వంటి సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకి చెందిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.