English | Telugu

ప్రధాని మోడీని కలిసిన నాగార్జున!

ప్రధాని నరేంద్ర మోడీతో అక్కినేని నాగర్జున ఫ్యామిలీ భేటీ అయింది. శుక్రవారం పార్లమెంట్ హౌస్ లో పీఎంని కలిశారు. మోడీని కలిసిన వారిలో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఉన్నారు. అక్కినేని నాగేశ్వరావు (ANR) గురించి ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ రచించిన పుస్తకాన్ని మోడీకి అందించారు. ఈ సందర్భంగా సినీ రంగానికి ఏఎన్నార్ చేసిన ప్రధాని ప్రశంసించినట్లు సమాచారం. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఏఎన్నార్ ను ప్రశంసించారు మోడీ. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా పీఎంకి కృతఙ్ఞతలు తెలిపాడు నాగార్జున.

కాగా నాగ చైతన్య హీరోగా నటించిన 'తండేల్' మూవీ ఈరోజు(ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని అభిమానులు ఆ ఆనందంలో ఉండగానే, ఇదే రోజు మోడీని అక్కినేని ఫ్యామిలీ కలవడం మరింత ప్రత్యేకంగా మారింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.