English | Telugu

కార్తీ సినిమాకి షాక్ ఇచ్చిన చెన్నైహైకోర్ట్.. 12 న రిలీజ్ ఉందా లేదా!

-కార్తీ సినిమాకి షాక్
-12 న రిలీజ్ ఉంటుందా!
-చెన్నై కోర్ట్ ఏం చెప్పింది
-ఫైనాన్షియల్ ప్రాబ్లమా!

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ ని సంపాదించిన కార్తీ(Karthi)ఈ నెల 12 న 'వా వాతియార్'(vaa vaathiyar)అనే కొత్త చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు. తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ప్రచార చిత్రాలు బాగుండటంతో కార్తీ ఈ సారి బిగ్గెస్ట్ హిట్ ని అందుకోవడం ఖాయమనే నమ్మకం అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఏర్పడింది. కానీ ఇప్పుడు 'వా వాతియార్' అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నారు.

'వా వాతియార్' ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె. ఇ. జ్ఞానవేల్ రాజా(K.e Gnanavel Raja)నిర్మించారు. కార్తీకి జ్ఞానవేల్ రాజా బంధువు కూడా. చెన్నై చెందిన అర్జున్‌లాల్‌ అనే ఫైనాన్షియర్ వద్ద జ్ఞానవేల్‌ రాజా గతంలో 10.35 కోట్లరూపాయిల రుణం తీసుకున్నాడు. ప్రస్తుతం సదరు అప్పు వడ్డీతో కలిపి 21.78 కోట్లకి చేరింది. దీంతో అర్జున్ లాల్ చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసాడు. సదరు పిటిషన్ లో జ్ఞానవేల్‌ రాజా తనకి రావాల్సిన అమౌంట్ ని ఇవ్వకుండా కొత్త సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బకాయిలు పూర్తిగా క్లియర్ చేసే వరకు ‘వా వాదియార్’ విడుదలని ఆపాలని పిటిషన్ లో పొందుపరిచాడు. విచారణ జరిపిన హైకోర్టు 'వా వాదియార్’ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎనిమిదవ తారీఖున తీర్పు ఎలా వస్తుందన్న టెన్షన్ లో ఉన్నారు.

also read: బాలయ్య, బోయపాటి లు నిర్మాతలతో భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన

ఇండస్ట్రీ వర్గాలు ఈ విషయంపై స్పందిస్తు విచారణలోపు జ్ఞానవేల్ రాజా డబ్బు చెల్లించకపోతే మూవీ విడుదల మరింత ఆలస్యం కావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్తీ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి(Krithi Shetty)జత కట్టగా సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్ కీలక క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. నలన్ కుమారస్వామి(nalan kumarasamy)దర్శకుడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.