English | Telugu

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో తార‌ల సంద‌డే సంద‌డి!

తెలుగునాట కొంద‌రు ప్ర‌ముఖ తార‌లు రెండు వ‌రుస నెల‌ల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సంద‌డి చేయ‌నున్నారు. వారి వివ‌రాల్లోకి వెళితే..

రామ్ చ‌ర‌ణ్ః మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా వ‌రుస నెలల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో హీరోగా ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు. మార్చి 25న ఫిక్ష‌న‌ల్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`తో ప‌ల‌క‌రించ‌నుండ‌గా.. ఏప్రిల్ 29న సోష‌ల్ డ్రామా `ఆచార్య‌`తో రాబోతున్నారు. ఈ రెండు కూడా మ‌ల్టిస్టార‌ర్స్ నే కావ‌డం విశేషం. `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తోనూ, `ఆచార్య‌`లో మెగాస్టార్ చిరంజీవితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు చ‌ర‌ణ్.

Also Read: 'భీమ్లా నాయ‌క్' రిలీజ్‌కు జ‌గ‌న్ ఓకే చెప్పిన‌ట్లేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్ః టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో త‌న సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. మార్చి 3న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రాబోతున్న `హే సినామిక‌`తోనూ, ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న `ఆచార్య‌`తోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ ఆక‌ట్టుకొనేందుకు సిద్ధ‌మైంది.

Also Read:సింగ‌ర్ రేవంత్ పెళ్ల‌యిపోయింది!

పూజా హెగ్డేః బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే రెండు వ‌రుస నెల‌ల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మెస్మ‌రైజ్ చేసేందుకు సిద్ధ‌మైంది. మార్చి 11న రాబోతున్న పాన్ - ఇండియా మూవీ `రాధే శ్యామ్`లో ప్రేర‌ణ‌గానూ, ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న `ఆచార్య‌`లో నీలాంబ‌రిగానూ వినోదాలు పంచ‌నుంది.

Also Read:బాక్సాఫీస్ క్లాష్: అజిత్ వ‌ర్సెస్ ఆలియా భ‌ట్!

ఆలియా భ‌ట్ః బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్.. రెండు వ‌రుస నెల‌ల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సంద‌డి చేయ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 25న హిందీ అనువాద చిత్రం `గంగూబాయి క‌థియ‌వాడి`తోనూ.. మార్చి 25న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్`తోనూ ఆలియా క‌నువిందు చేయ‌నుంది.

మ‌రి.. వీరిలో ఎవ‌రెవ‌రికి బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ లో విజ‌యాలు ద‌క్కుతాయో చూడాలి.