English | Telugu

డీఎస్పీ.. డ‌బ్బే డ‌బ్బు!

ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలున్న సంగీత ద‌ర్శ‌కుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. ఒక‌వైపు `ఖిలాడి`, `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు`, `రంగ రంగ వైభ‌వంగా`, `ఎఫ్ 3` చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. మ‌రోవైపు `పుష్ప - ద రూల్`, `మెగా 154`, `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి.

Also Read:'మేజ‌ర్' మాసివ్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ఇదిలా ఉంటే.. విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ఖిలాడి`, `ఎఫ్ 3` విష‌యానికి వ‌స్తే.. ఈ రెండు చిత్రాలకు ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా `డ‌బ్బు`ని క‌థాంశంగా చేసుకుని రూపొందిన చిత్రాలే. మాస్ మ‌హారాజా ర‌వితేజ ద్విపాత్రాభిన‌యంలో తెర‌కెక్కిన‌ `ఖిలాడి` డ‌బ్బు చుట్టూ తిరిగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాగా, విక్ట‌రీ వెంక‌టేశ్ - మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌స్తున్న మ‌ల్టిస్టార‌ర్ `ఎఫ్ 3` ఏమో డ‌బ్బు చుట్టూ అల్లుకున్న హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్. మొత్తంగా.. డీఎస్పీ నుంచి రాబోయే ఈ రెండు సినిమాల్లో `డ‌బ్బు` హైలైట్ కానుంద‌న్న‌మాట‌. వీటిలో `ఖిలాడి` ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ కానుండ‌గా.. `ఎఫ్ 3` ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది.

Also Read:ఏడు రిలీజ్ డేట్స్ ప్రకటించి షాకిచ్చిన నాని!

కాగా, గ‌తంలో డీఎస్పీ సంగీత సార‌థ్యంలో `డ‌బ్బు` చుట్టూ అల్లుకున్న `జులాయి` లాంటి చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయిన నేప‌థ్యంలో.. `ఖిలాడి`, `ఎఫ్ 3` కూడా అదే బాట ప‌డ‌తాయేమో చూడాలి.