బాక్సాఫీస్ క్లాష్: అజిత్ వర్సెస్ ఆలియా భట్!
on Feb 6, 2022

`ఆర్ ఆర్ ఆర్`తో తెలుగునాట కథానాయికగా తొలి అడుగేయబోతోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. వేసవి కానుకగా మార్చి 25న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా కంటే ముందే ఓ ఆసక్తికరమైన అనువాద చిత్రంతో ఇక్కడివారిని పలకరించబోతోంది ఆలియా. ఆ చిత్రమే.. `గంగూబాయ్ కథియవాడి`. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా.. ఫిబ్రవరి 25న జనం ముందుకు రానుంది. ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు.
ఇదిలా ఉంటే.. `గంగూబాయ్`కి పోటీగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆ వారం సందడి చేయనుంది. ఆ సినిమానే.. `వలిమై`. కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనుండగా.. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. `ఖాకీ` ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. మరి.. అజిత్ వర్సెస్ ఆలియా భట్ అన్నట్లుగా ఉన్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
కాగా, `వలిమై`లో కథానాయికగా నటించిన హ్యూమా ఖురేషి.. `గంగూబాయ్`లో అతిథి పాత్రలో కనిపించనుండడం ఓ విశేషమనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



