సింగర్ రేవంత్ పెళ్లయిపోయింది!
on Feb 7, 2022

పాపులర్ తెలుగు గాయకుడు, ఇండియన్ ఐడల్-9 విన్నర్ రేవంత్ పెళ్లికొడుకయ్యాడు. గుంటూరుకు చెందిన అన్విత గంగరాజుతో అతని వివాహం ఆదివారం ఫిబ్రవరి 6న గుంటూరులోని ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. రేవంత్‌కు సన్నిహితులైన గాయనీ గాయకులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. Also read: తెలుగులో లత పాడిన రెండు పాటలు ఇవే!
కాగా, డిసెంబర్ 24న రేవంత్, అన్విత నిశ్చతార్ధం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రేవంత్ షేర్ చేశాడు. రేవంత్‌కు చిరంజీవ 'చిరంజీవ' (బద్రినాథ్), 'రూలర్' (దమ్ము), 'మనోహరీ' (బాహుబలి), 'తెలిసెనే' (అర్జున్‌రెడ్డి), 'శానా కష్టం' (ఆచార్య) పాటలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2015లో జరిగిన ఇండియన్ ఐడల్ 9వ సీజన్‌లో పంజాబ్‌కు చెందిన ఖుదాబక్ష్, హైదరాబాద్‌కు చెందిన తోటి తెలుగు గాయకుడు రోహిత్‌తో పోటీపడి విజేతగా నిలిచాడు రేవంత్. Also read: బుర్జ్ ఖలీఫా మీద ఒళ్లు జలదరింపచేస్తున్న మహేశ్ యాక్షన్!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



