'భీమ్లా నాయక్' రిలీజ్‌కు జగన్ ఓకే చెప్పినట్లేనా?
on Feb 7, 2022
.webp)
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీ ఎప్పుడు రిలీజవుతుంది? ఇది కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను, సినీ గోయర్స్‌ను వెంటాడుతున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఆ ప్రశ్నను తనను కాకుండా ఏపీ సీయం వైఎస్ జగన్‌ను అడగాలంటూ ఒక స్టేజిపై వ్యాఖ్యానించడం వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు 'భీమ్లా నాయక్' విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చేసినట్లేనని అంటున్నారు. అంటే ఆ సినిమా రిలీజ్‌కు జగన్ మార్గం సుగమం చేస్తున్నారన్న మాట.
ఫిబ్రవరి 14 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తున్నారు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారని తెలుస్తోంది. ఇదివరకే అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలం కాబోతున్నందున ఫిబ్రవరి 25న ఆ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. Also read: తెలుగులో లత పాడిన రెండు పాటలు ఇవే!
ఇదే జరిగితే శర్వానంద్, రష్మిక మందన్న జోడీగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. 'భీమ్లా నాయక్' ఏప్రిల్ 1న వచ్చే చాన్స్ ఉందని భావించినందువల్లే వారు ఫిబ్రవరి 25న తమ సినిమాని తీసుకు రావాలని సంకల్పించారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆ సినిమా పాటలు ఆకట్టుకున్నాయి కూడా. Also read: ఇలియానా.. బరువు పెరిగిందిలా!
సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రధారులు. మలయాళం హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు ఇది రీమేక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



