English | Telugu
Avatar 3: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?
Updated : Dec 18, 2025
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన అద్భుతం 'అవతార్'కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో భాగంగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వస్తోంది. రేపు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు రానున్న అవతార్-3.. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. (Avatar: Fire and Ash)
2009 డిసెంబర్ లో విడుదలైన అవతార్ మూవీ, తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ సమయంలో ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం గొప్ప విషయం. ఇక 'అవతార్-2' మూవీ 2022 డిసెంబర్ లో విడుదల కాగా.. తెలుగునాట ఏకంగా రూ.101 కోట్ల గ్రాస్ రాబట్టింది. (Avatar 3)
Also Read: కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. డెకాయిట్ టీజర్ అదిరింది!
ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో 'అఖండ-2' విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పైగా, 'అవతార్-2' స్థాయిలో 'అవతార్-3'పై ఎందుకనో హైప్ రాలేదు. దీంతో మళ్ళీ తెలుగునాట ఆ రేంజ్ లో ప్రభావం చూపుతుందా లేదా? అనే చర్చ జరుగుతోంది. 'అవతార్-3' రూ.50 కోట్ల దాకా రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ జేమ్స్ కామెరూన్ బిగ్ స్క్రీన్ పై మళ్ళీ మ్యాజిక్ చేస్తే.. ఆ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.