English | Telugu

అనుష్క గర్భవతా..!!


కెరీర్‌లో ఇప్పుడు ఎన్నో మంచి అవకాశాలున్న సమయంలో అనుష్క ఇలా గర్భవతి అవడం ఏమిటని ఆశ్చర్య పోనవసరం లేదు. ఇది ఆమె నటిస్తున్న ఒక భారీ చిత్రంలో పాత్ర గురించి. బాహుబలిలో ప్రభాస్ సరసన అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సెకండ్ హాఫ్‌లో ఆమె గర్భవతిగా కనిపించనుందని టాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
సౌత్‌లో అనుష్కకు వున్న క్రేజ్ సూపర్ సినిమా నుంచి నేటి వరకూ తగ్గలేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ డాల్ గానే కాకుండా అరుంధతి చిత్రం ద్వారా రిచ్ అండ్ గ్లోరియస్ క్వారెక్టర్స్ అనగానే ఆమె పేరే గుర్తుకు వచ్చేలా తన ఇమేజ్‌ను మార్చేసుకుంది.
బాహుబలి ఫస్ట్‌లుక్‌లో ఎంతో అద్భుతంగా కనిపించిన అనుష్క ఈ చిత్రంలో ఇంకెన్ని విన్యాసాలు చేస్తుందో, ఎన్ని కొత్త రూపాల్లో కనిపిస్తుందో వేచి చూడాల్సిందే.
అనుష్క రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలితో పాటు, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం రుద్రమదేవిలో కూడా టైటిల్ పాత్ర పోషిస్తోంది.