English | Telugu

ఆ మూవీ చూసి సైలెంట్ అయిన అల్లు అర్జున్..అసలు కారణం ఆ నలుగురే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాని విపరీతంగా ప్రేమించే అల్లు అర్జున్ కొత్తగా వచ్చే సినిమాలని కూడా చూసి ఆ మూవీ మీద ఉన్న తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్తాడు. బన్నీ తాజాగా యానిమల్ మూవీని చూసాడు. ఇప్పుడు ఆ మూవీ మీద బన్నీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

యానిమల్ మూవీ మీద బన్నీ తన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పాడు.హీరోగా చేసిన రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్సపీరియన్సు ని వేరే లెవల్ కి తీసుకెళ్లాడు. స్క్రీన్ మీద ఆయన చేసిన మ్యాజిక్ ని చూసి నాకు నోటమాట కూడా రావడం లేదు. అలాగే ఆయన నటన నాకు చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచింది.అని చెప్పాడు. హీరోయిన్ గా చేసిన రష్మిక ఎంతో బ్రిలియంట్ గా నటించింది. అలాగే తను ఇంతవరకు చేసిన అన్ని సినిమాలకంటే యానిమల్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. బాబీ డియోల్ గారి యాక్టింగ్ ని చూస్తున్నంత సేపు సైలెంట్ గా ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఆయన నటన రెస్పెక్ట్ ఇస్తు చాలా నేర్చుకున్నాను అని కూడా బన్నీ చెప్పాడు.

ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి ని అయితే బన్నీ ఆకాశానికి ఎత్తేసాడు.సందీప్ గారు మీరు సినిమాకి సంబంధించి ఉండే అన్ని పరిమితులని అధిగమించారు. యానిమల్ ని మీరు తెరకెక్కించిన విధానం టెర్రిఫిక్ గా ఉంది. భవిష్యత్తు లో మీరు భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మీ దర్శకత్వంతో మార్చబోతున్నారు అని చెప్పాడు.ఇలా బన్నీ పేరు పేరున ప్రశంసలు తెలపడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అలాగే సినిమాలో నటించిన ఇతర నటీనటులకి, టెక్నీషియన్స్ కూడా బన్నీ తన అభినందనలని తెలిపాడు.