English | Telugu

దేవర టీజర్.. సలార్, డంకీ సినిమాలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యూ కట్టాల్సిందే!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీ టీం దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది.

ఏప్రిల్ లో సినిమా విడుదల కాబట్టి, జనవరి నుంచి దేవర టీమ్ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందే అదిరిపోయే ప్లానింగ్ తో ప్రమోషన్ ని షురూ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం మూవీ టీం టీజర్ ని సిద్ధం చేసే పనిలో ఉందట. త్వరలో టీజర్ ని రెడీ చేసి.. డిసెంబర్ 21, 22 తేదీల్లో విడుదలవుతున్న డంకీ, సలార్ సినిమాలు ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లలో ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. అనుకున్న టైంకి వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయితే టీజర్ రావడం ఖాయమే అంటున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.