English | Telugu

అల్లు అర్జున్, హన్సిక జంటగా చిత్రం

అల్లు అర్జున్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా ఒక చిత్రం రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో అల్లు అర్జున్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా త్వరలో ఒక చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. ఈ చిత్రానికి "ఆర్య" ఫేం సుకుమార్ దర్శకత్వం వహిస్తారట. గతంలో అల్లు అర్జున్ ‍, హన్సిక కలసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "దేశముదురు" అనే చిత్రంలో జంటగా నటించారు.

ఆ చిత్రం హీరోయిన్ గా హన్సిక మోత్వానికి తొలి చిత్రం కాగా ఆ చిత్రం సూపర్ హిట్టయ్యింది. మళ్ళీ అదే జంట కలసి నటిస్తూండటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలుంటాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన "ఆర్య" చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. మరి వీరి ముగ్గురి కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఎన్ని సెన్సేషన్లు సృష్టిస్తుందో కాలమే చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.