English | Telugu

రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ కి నటి స్నేహ

రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ కి నటి స్నేహ వెళ్ళనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే హీరోయిన్ స్నేహకు తెలుగులో అవకాశాలు తగ్గటంతో దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ ఉంది. అందుకే ఆమె బాలీవుడ్ వైపు తన దృష్టి మళ్ళించింది. ఆ దిశలో భాగంగా హిందీలో "మ్యాడ్ డాడీ" అనే చిత్రంలో నటించటానికి అంగీకరించింది. హీరోయిన్ గా మాత్రం కాదులెండి. హీరోయిన్ ఆయేషా టకియాకి తల్లి పాత్రలో నటి స్నేహ నటించటానికి అంగీకరించింది.

ఈ చిత్రానికి ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో నటి స్నేహ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా సరసన అతని భార్యగా నటించనుంది. అంటే ఆయేషా టకియాకి స్నేహ, నసీరుద్దీన్ షా తల్లిదండ్రులుగా నటిస్తారన్న మాట. ఇక ఈ చిత్ర దర్శకురాలు గతంలో తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన "ప్రేమ" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.