English | Telugu

Akhanda 2: గూస్ బంప్స్ తెప్పిస్తున్న అఖండ తాండవం సాంగ్.. బాక్సాఫీస్ రికార్డులు జాగ్రత్త!

నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం మొదలైంది. 'అఖండ-2' సినిమా నుండి మొదటి గీతం 'తాండవం' విడుదలైంది. (Akhanda 2 Thaandavam)

సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అఖండ-2'. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.

అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు అఖండ సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళేలా ఫస్ట్ సింగిల్ 'తాండవం' రిలీజ్ అయింది.

అఖండ విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఇప్పుడు 'అఖండ-2'కి అంతకు మించిన మ్యాజిక్ చేయబోతున్నాడని 'తాండవం' సాంగ్ తో క్లారిటీ వచ్చింది.

తమన్ స్వరపరిచిన 'అఖండ తాండవం' సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. "ఖండ ఖండ ఖండిత.. దండ యోగ మండిత" అంటూ కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. ఆ మ్యూజిక్, లిరిక్స్ కి తగ్గట్టుగానే.. గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.

ఇక లిరికల్ వీడియోలో బాలకృష్ణ కనిపించిన తీరు అద్భుతం. త్రిశూలం చేత పట్టి రౌద్ర రసం పలికించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే శివ తాండవం ఆడారని చెప్పవచ్చు.

'అఖండ తాండవం' సాంగ్ లిరికల్ వీడియో చూస్తుంటే.. బాలకృష్ణ, బోయపాటి, తమన్ త్రయం మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడటం ఖాయమనిపిస్తోంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.