English | Telugu
ఫిల్మ్ ఫేర్ లో సందడి చేసిన ఈగ
Updated : Jul 22, 2013
60వ ఫిల్మ్ ఫేర్ దక్షిణాది అవార్డుల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఇందులో భాగంగా తెలుగు చిత్రాల క్యాటగిరిలో...
ఉత్తమ చిత్రంగా "ఈగ"
ఉత్తమ దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి(ఈగ)
ఉత్తమ నటిగా సమంత(ఈగ)
ఉత్తమ సహాయ నటుడిగా సుదీప్(ఈగ)
ఉత్తమ గ్రాఫిక్స్ చిత్రంగా "ఈగ" చిత్రానికి అవార్డులను దక్కించుకున్నారు.
ఉత్తమ నటుడిగా పవన్ కళ్యాణ్ ("గబ్బర్ సింగ్")
ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ ("గబ్బర్ సింగ్")
ఉత్తమ గాయకుడిగా వడ్డేపల్లి శ్రీనివాస్ (పిల్లా నువ్వులేని జీవితం..పాట) అవార్డులను దక్కించుకున్నారు.
అదే విధంగా
ఉత్తమ పాటల రచయితగా అనంత శ్రీరామ్ (ఏది ఏది.... ఎటో వెళ్ళిపోయింది)
ఉత్తమ సహాయ నటిగా అమల (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా చోటా.కె.నాయుడు (డమరుఖం)
ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ(డిల్లకు డిల్లా..రచ్చ)లు అవార్డులను అందుకున్నారు.
జీవిత కాల సౌఫల్య పురస్కారాలను బాపు, వాణీ జయరాం లకు ప్రధానం చేసారు.