English | Telugu

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి కెవ్వుకేక అప్డేట్!

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి కెవ్వుకేక అప్డేట్!

Publish Date:Jul 30, 2025

  ఓ వైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోవైపు తాను గతంలో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఇటీవల 'హరి హర వీరమల్లు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. అలాగే 'ఓజీ' షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇక ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' వంతు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. (Ustaad Bhagat Singh)   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇటీవల భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెరకెక్కించినట్లు టీమ్ అధికారికంగా తెలిపింది. అదే జోష్ లో ఇప్పుడు ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.   'ఉస్తాద్ భగత్ సింగ్'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' కోసం ఆయన స్వరపరిచిన సాంగ్స్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆల్బమ్ ఉండేలా చూస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న పాటకు.. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ అందించారట. ఈ సాంగ్ ఫ్యాన్స్ చేత కెవ్వుకేక అనిపించేలా ఉంటుందని చెబుతున్నారు.  
Vijay Deverakonda expresses great confidence on Kingdom

Vijay Deverakonda expresses great confidence on Kingdom

Publish Date:Jul 30, 2025

The highly anticipated Telugu film Kingdom, starring Vijay Deverakonda, is poised for a worldwide release on July 31st. With Bhagyashree Borse and Satyadev in key roles, the Gowtam Tinnanuri directorial, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, has generated immense buzz, particularly following its compelling promotional material and trailer. Rockstar Anirudh Ravichander has composed the music. At a recent press meet, lead actor Vijay Deverakonda expressed his satisfaction with the film's output and the overwhelming pre-booking response. He confidently stated, "The emotional depth in Kingdom will completely captivate audiences... It’s a film that promises a heartfelt experience for everyone." He emphasized the film's roots in family emotions, drawing parallels between historical wars and the film's narrative. Producer Suryadevara Naga Vamsi echoed this sentiment, highlighting the film's strong advance bookings as a successful "first test." He assured audiences that Kingdom is not a conventional action film but a gangster drama infused with Gowtam Tinnanuri's signature emotional depth, crafted to resonate with all sections.   Naga Vamsi also noted the film's authenticity, having been largely shot in real locations. Lead actress Bhagyashree Borse also shared her gratitude for her "crucial role" as Madhu.

తెలుగు సినిమా పాటకు కొత్త సొబగులు అద్దిన డా. సి.నారాయణరెడ్డి!

Publish Date:Jul 29, 2025

(జూలై 29 సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా..) ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..’, ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’, ‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు..’ అంటూ జాతిని మేల్కొలిపే పాటలు, ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..’, ‘వగలరాణివి నీవే..’, ‘అంతగా నను చూడకు..’ అంటూ ప్రేమను పలికించే పాటలు, ‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి..’, ‘ఓ నాన్నా.. నీ మనసే వెన్న..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’ అంటూ సెంటిమెంట్‌తో నిండిన పాటలు.. ఇలా సందర్భం ఏదైనా, సన్నివేశం ఏదైనా.. తన కలం నుంచి అలవోకగా అక్షరాలు జాలువారతాయి. ఆ పాటలు విన్న శ్రోతల మనసులు ఆనందంతో వెల్లివిరుస్తాయి. విభిన్నమైన శైలి, మనసును తాకే భావజాలం ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు.. డా. సి.నారాయణరెడ్డి. సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులుగా పేరు పొంది, ఆ తర్వాత సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన మహా రచయిత సి.నారాయణరెడ్డి. అందరూ ఎంతో అభిమానంతో సినారే అని పిలుచుకునే ఆయన రచనా రంగంలో,  సినీ రంగంలో సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. 1931 జూలై 29న కరీంనగర్‌ జిల్లాలోని హనుమాజీపేటలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన ప్రాథమిక విద్య అంతా ఒక వీధిబడిలోనే జరిగింది. చిన్నతనంలో హరికథలు, జానపదాలు, జంగం కథలపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రాథమికోన్నత విద్య నుంచి డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు సినారె. తెలుగు అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఉర్దూ మీడియంలో చదువును కొనసాగిస్తూనే తెలుగు భాషపై సాధన చేస్తూ పట్టు సంపాదించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి డాక్టరేట్‌ కూడా పొందారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో లెక్కకు మించిన గ్రంథాలు చదివారు. జలపాతం, విశ్వగీతి, నాగార్జున సాగరం, అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు వంటి రచనలు చేసి, తెలుగు సాహితీప్రియులను ఆనందసాగరంలో మునకలు వేయించారు. సినారె రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్నారు సినారె. గేయ కావ్యాలు, గేయ నాటికలు, కవితలు, సినిమా పాటలు.. ఇలా ఎన్నో రచనలు చేసి సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారు సినారె. ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి, అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవుల్లో కొనసాగారు. సి.నారాయణరెడ్డి కవితా వైభవం గురించి తెలుసుకున్న ఎన్‌.టి.రామారావు ఆయన్ని సినిమా రంగానికి ఆహ్వానించారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న గులేబకావళి కథ చిత్రంలో పాటలు రాయమని కోరారు. దానికి సినారె ఒక షరతు పెట్టారు. తన తొలి సినిమా కాబట్టి అన్ని పాటలూ రాసే అవకాశం ఇస్తే రాస్తానని చెప్పారు. దానికి ఎన్టీఆర్‌ కూడా అంగీకరించి ఆ సినిమాలోని 11 పాటలు సినారెతో రాయించారు. ఆయన రాసిన తొలి సినిమా పాట ‘నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని..’. ఆయన రాసిన ఈ పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  సినారె రాసిన తొలి సినిమాలోని పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దాంతో బి.యన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, కె.ప్రత్యగాత్మ వంటి ప్రముఖ దర్శకులు తమ సినిమాలకు కూడా పాటలు రాయించుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తన తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’ మొదలుకొని ‘జీవనజ్యోతి’ వరకు ప్రతి చిత్రంలోనూ సినారెతో పాటలు రాయించుకున్నారు. తర్వాతి రోజుల్లో విశ్వనాథ్‌ తన సినిమాల్లోని పాటలను వేటూరి, సిరివెన్నెలతో రాయించుకున్నప్పటికీ అవసరమైన సమయంలో స్వాతిముత్యం, స్వాతికిరణం వంటి చిత్రాలకు మళ్ళీ సినారెతోనే గీతరచన చేయించడం విశేషం. ఇలా ఎందరో సినారె పాటకు పట్టాభిషేకం చేశారు. దాసరి, కోడి రామకృష్ణ వంటి దర్శకులు సైతం తమ చిత్రాలలో సినారె పాటకు ప్రత్యేక స్థానం కల్పించారు. కొందరు నిర్మాతలు సినారె పాట లేకుంటే సినిమానే తీయమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.  పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో సినారెకు మంచి అవకాశాలు ఇచ్చారు ఎన్‌.టి.రామారావు. శ్రీకృష్ణపాండవీయంలో ఆయన రాసిన స్వాగతం.. సుస్వాగతం.. పాటను ఇప్పటికీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఇదేనా మన సంప్రదాయమిదేనా.., జయీభవా విజయీభవా.. వంటి ఎన్నో పాటలు సినారె కలం నుంచి జాలువారాయి. ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన చివరి చిత్రం సామ్రాట్‌ అశోక లోనే కాదు, ఆయన నటించగా విడుదలైన ఆఖరి సినిమా శ్రీనాథ కవిసార్వభౌముడులోనూ సినారె పాటలు రాశారు. ఇలా తను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్ళ నుంచి చివరి వరకు ఎన్టీఆర్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగించారు సినారె.  సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను ఎన్నో పురస్కారాలు సి.నారాయణరెడ్డిని వరించాయి. సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్‌ అవార్డు, కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు సినారెకు లభించాయి. సీతయ్య చిత్రంలోని ఇదిగొ రాయలసీమ గడ్డ.., ప్రేమించు చిత్రంలోని కంటేనే అమ్మ అని అంటే ఎలా.. పాటలకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. 1997లో అప్పటి రాష్ట్రపతి.. సినారెను రాజ్యసభ్యుడిగా నామినేట్‌ చేశారు. చివరి వరకూ ఏదో ఒక సినిమాలో తను మాత్రమే రాయగల ఎన్నో పాటలు రచించారు సినారె. 2017లో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్‌ 12న తుదిశ్వాస విడిచారు డా.సి.నారాయణరెడ్డి.

బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సైయారా..!

Publish Date:Jul 29, 2025

  ఒకప్పుడు ఇండియాలో టాప్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ పేరు వినిపించేది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఎక్కువగా హిందీ నుంచే వచ్చేవి. అలాంటిది కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి బాలేదు. స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో నూతన నటీనటులు నటించిన సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'సైయారా'. రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. (Saiyaara)   'మర్డర్ 2', 'ఆషికీ 2', 'ఏక్ విలన్', 'మలంగ్' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైయారా'. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జూలై 18న థియేటర్లలో అడుగుపెట్టిన 'సైయారా' మూవీ.. కేవలం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పటిదాకా ఇండియాలో రూ.318 కోట్లు, ఓవర్సీస్ లో రూ.86 కోట్లతో.. ప్రపంచవ్యాప్తంగా రూ.404 గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదే జోరు కొనసాగితే త్వరలో రూ.500 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.   జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్-2' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ భారీ సినిమాకి ముందు 'సైయారా' రూపంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ కి బిగ్ హిట్ వచ్చిందని చెప్పవచ్చు.  

బిగ్ బాస్ టీమ్ పంపే మెయిల్స్ ని షేర్ చేయొద్దు....మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది

Publish Date:Jul 30, 2025

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో కామన్ మ్యాన్ కేటగిరి నుంచి కొంతమంది తీసుకుంటున్నారు. వాళ్లకు టెస్టులు కూడా పెడుతున్నారు. ఇదంతా కూడా మెయిల్స్ ద్వారా జరుగుతోంది. ఐతే ఆది రెడ్డి ఈ విషయాన్నీ చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా చెప్పాడు. "రౌండ్ 3 గ్రూప్ డిస్కషన్ ఆగష్టు 3 న జరగబోతోంది.  మీరు నెక్స్ట్ రౌండ్స్ కి  సెలెక్ట్ అయ్యారంటూ మీకు ఈమెయిల్స్ వస్తే గనక దయచేసి గుర్తుపెట్టుకోండి వాటిని ఎవరికీ షేర్ చేయకండి. ఎందుకంటే నాకు కొంతమంది అలాంటి మెయిల్స్ స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఒక వేళా అలా మీ మెయిల్ లోని ఇన్ఫర్మేషన్ లీక్ ఐతే గనక అప్పుడు బిబి టీమ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా కాన్ఫిడెన్షియల్ మెసేజ్ ని లీక్ చేసిన బేసిస్ మీద మీరు సెలెక్ట్ ఐనా కానీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ టీమ్ లేటెస్ట్ అప్ డేట్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. డెబ్జనిని, జానూ లిరి, ఇమ్మానుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ ని, ఫోక్ డాన్సర్ నాగ దుర్గాని బిగ్ బాస్ టీమ్ అప్ప్రోచ్ ఐనట్టు తెలుస్తోంది. అలాగే ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఎక్స్ హౌస్ మేట్స్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

SSMB29: మహేష్ బాబు ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

Publish Date:Jul 26, 2025

  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. 'SSMB29' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'SSMB29' అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.   రాజమౌళి తన గత సినిమాలకు భిన్నంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండానే 'SSMB29' షూట్ మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంతవరకు సినిమా నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రాలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో ఆరోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. గ్లింప్స్ విడుదల ఉంటుందని అభిమానులు భావించారు. అయితే మహేష్ బర్త్ డేకి ఎటువంటి అప్డేట్ ఉండదని తెలుస్తోంది. అనౌన్స్ మెంట్ కి ఇంకా టైం తీసుకోబోతున్నారని సమాచారం. ఓ రకంగా ఇది ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. అయితే 'SSMB29' గ్లింప్స్ ఎప్పుడు విడుదలైనా.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయమని అంటున్నారు.  

Tom Cruise and Ana de Armas set Internet ablaze

Publish Date:Jul 30, 2025

Hollywood Superstar Tom Cruise has been linked with many hot and happening actresses before. He had been open about his relationships and divorces, too. Now, the actor showed up in public, sensational star Ana de Armas. They both got clicked by paparazzi, with Cruise holding hand of Ana.  Well, both of them are going to star in supernatural ocean thriller, Deeper. Recently, Tom Cruise appeared in his much revered spy saga, Mission Impossible: The Final Reckoning and Ana de Armas, did Ballerian, a spin-off from John Wick series. They both have been seen in Vermont, with Cruise holding her hand.  Is this about professional bond building before taking off their project to sets or if there are more sparks of romance, the actors did not officially confirm. Still, majority of reports from Hollywood are confirming that they have been dating and this is almost an officially confirmation.  Previously, Ana de Armas had been in a relationship with Ben Affleck and from February, she had been appearing with Cruise in several places. While their publicists kept calling it as "Special Work Relationship" and "Just Friendly" meet-ups, this Vermont sighting in casual wear has almost confirmed it for many that they are dating.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

జూనియర్

Publish Date:Jul 18, 2025

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025

Thammudu

Publish Date:Jul 4, 2025

Uppu Kappurambu

Publish Date:Jul 4, 2025