English | Telugu

రవితేజ మల్టిప్లెక్స్ రేపే ప్రారంభం.. మొదటి ఆట ఏ సినిమా

మహేష్ బాబు(Mahesh Babu),అల్లుఅర్జున్(Allu Arjun)హైదరాబాద్(Hyderabad)లో ఏషియన్ సంస్థతో కలసి అత్యాధునిక సదుపాయాలతో కూడిన మల్టిప్లెక్స్ లని భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే. AMB, AAAపేరుతో ఉన్న సదరు మల్టిప్లెక్స్ లు ప్రేక్షకులకి క్వాలిటీ తో కూడిన సినీ వినోదాన్ని అందిస్తున్నాయి.

మాస్ మహారాజ 'రవితేజ'(Ravi Teja)కూడా 'హైదరాబాద్' లోని చింతలకుంట బస్తీ( (ఎల్ బినగర్) లో ఉన్న 'తత్వ మాల్' లో ఏషియన్ సంస్థతో కలిసి 'ఏఆర్ టి'(Art)పేరుతో మల్టి ప్లెక్స్ లని ఏర్పాటు చెయ్యడం జరిగింది. సినీ ప్రేమికులకి ప్ర‌పంచ స్థాయి సినిమా ఎక్స్ పీరియెన్స్ ని కలిగించేలా ప్ర‌త్యేకమైన ఫీచ‌ర్స్ ఉన్న 4కే క్వాలిటీ ప్రొజెక్షన్, అల్ట్రా క్లియర్ విజువల్స్‌తో 57 అడుగుల వెడల్పు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వీటిలో 1, 2, 5, స్క్రీన్లు డాల్బీ 7.1 లేజ‌ర్‌ ప్రోజెక్ష‌న్ తో ఉండ‌గా 3,4,6 స్క్రీన్లు డాల్బీ అట్మోస్ లేజ‌ర్‌ ప్రోజెక్ష‌న్‌ తో ఉన్నాయి. 6వ నంబ‌ర్‌ స్క్రీన్ ఎపిక్ స్క్రీన్‌గా భారీగా ఉండ‌నుంది. ఈ రోజు ర‌వితేజ స‌మ‌క్షంలో పూజ‌లు నిర్వ‌హించి రేపు విడుదల కానున్న 'కింగ్ డమ్'(Kingdom)మూవీతో మ‌ల్టీప్లెక్స్‌ ని ప్రారంభించబోతున్నారు. మ‌హావ‌తార్ న‌ర‌సింహా(Mahavatar Narsimha),హరిహ‌ర వీర‌మ‌ల్లు(HariHara Veeramallu),ఫెంటాస్టిక్ ఫోర్‌, సియారా సినిమాలు కూడా ఏఆర్ టి లో సందడి చేయనున్నాయి

'రవితేజ' అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే 'మాస్ జాతర' అగస్ట్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. 'శ్రీలీల'(Sreeleela)హీరోయిన్ గా చేస్తుండటం, రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో గతంలో 'ధమాకా' లాంటి హిట్ మూవీ వచ్చి ఉండటంతో,అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను 'మాస్ జాతర'(Mass Jathara)పై భారీ అంచనాలు ఉన్నాయి. భాను బోగవరపు దర్శకుడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.