English | Telugu
రేపు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ప్రధాని క్లారిటీ
Updated : Apr 13, 2020
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో తాజా పరిస్దితులపై సమీక్ష నిర్వహించిన ప్రధని మోడీ... రేపు మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో తన అభిప్రాయాన్ని మోడీ వెల్లడించనున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఇవాళ ట్వీట్ చేసింది.
వాస్తవానికి రెండురోజులుగా మంత్రి వర్గ బృందంతో పాటు అధికారులతో కీలక చర్చలు జరిపిన ప్రధాని, ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే పరిమిత లాక్ డౌన్ పై చర్చ జరుగుతున్న వేళ... మోడీ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో మోదీ పొడిగింపుకు మొగ్గు చూపుతారా లేక ఏపీ సీఎం జగన్ సూచించిన తరహాలో రెడ్ జోన్లకే దీన్ని పరిమితం చేస్తారో తేలాల్సి ఉంది.