English | Telugu
లాక్ డౌన్ ఎఫెక్ట్: కన్న కొడుకు రాలేక భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య..
Updated : Apr 13, 2020
వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా పందిళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ఈ గ్రామానికి చెందిన రాములు అర్ధరాత్రి మరణించాడు. అయితే తన కుమారుడు గుజరాత్ లో ఉద్యోగం చేయడం వల్ల తన స్వగ్రామానికి రాలేకపోయాడు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల తన తండ్రి అంత్యక్రియలు చేయడానికి రాలేకపోయాడు. దీనితో తన భర్త రాములు కి తన భార్య అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యాన్ని అంతా తన కుమారుడు వీడియోలో చూస్తూ భోరున విలపిస్తున్నాడు. ఇలాంటి విపత్కర సమయాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం.