English | Telugu
ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల డిస్మిస్
Updated : Dec 17, 2025
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు బుధవారం (డిసెంబర్ 17) కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పడానికి సాక్ష్యాధారాలు నమోదు కాలేదని పేర్కొంటూ అనర్హత పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు డిస్మస్ చేశారు. బుధవారం ఆయన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే.
దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడికి గాంధీకి సంబంధించిన అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు. కాగా సుప్రీంకోర్టు ఈ నెల 17వలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై తీర్పు వెలువరించారు.