English | Telugu

లాక్ డౌన్ రూల్స్ లోకేష్, దేవాన్ష్ లకు వర్తించవు

ఆయన ఏమి చేసినా సెన్సేషనే...కీలకమైన సమయం లో -పొరుగు రాష్ట్రం తెలంగాణాలో సేదతీరుతున్న నారా లోకేష్ చేస్తున్న సైక్లింగ్, అలాగే ఆయన కుమారుడు దేవాన్ష్ స్కెట్ బోర్డు మీద చేసిన విన్యాసాలు నెటిజెన్లకు ఇప్పుడు కావాల్సినంత స్టఫ్ అందిస్తున్నాయి. లాక్ దొళున్ నిబంధనలు ఉల్లంఘించి మరీ, ఆయన, ఆయన కుమారుడు- హైదరాబాద్ లోని తన ఇంటి రోడ్డుపై మాస్క్ లు లేకుండా లోకేష్ సైకిల్ తొక్కారు. లోకేష్ సైకిల్ తొక్కటమే కాకుండా తన తనయుడు నారా దేవాన్ష్ స్కేట్ బోర్డుపై హంగామా చేశారు. వీళ్లిద్దరి పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రం మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ వీళ్లు మాత్రం మాస్క్ లు లేకుండానే రహదారిపై సరదాగా తిరిగారు.దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో బయటకు వస్తే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని సర్కారు ఆదేశించింది. కానీ బాధ్యత గల మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలా చేయటం ఏమిటంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.