English | Telugu

ఇండియన్ నేవీ నీ వదలని కరోనా

*ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో అలజడి

21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలినట్టు, నేవీ అధికారులు వెల్లడించారు. ఆ 21 మందినినగరంలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స మొదలెట్టారు. ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్‌ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్ బేస్ లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు మొదలెట్టింది. బాధిత సెయిలర్లు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నది తేల్చే పనిలో అధికారులు ప్రస్తుతం బిజీ గా ఉన్నారు. భారత త్రివిధ దళాలలో ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీలో 8 కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.