English | Telugu

లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడ‌గింపు

ఎన్ని ఆటంకాలు క‌ష్టాలు వ‌చ్చినా ధైర్యంగా దేశం కోసం నిల‌బ‌డ్డారంటూ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. తిన‌డానికి, ప్ర‌యాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా క‌రోనాపై పోరాటానికి దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనాపై భార‌త్ యుద్ధం కొన‌సాగుతోంది. క‌రోనాను త‌ర‌మ‌డం కోసం ప్ర‌జ‌లు త్యాగాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సంతృప్తికరంగా అమ‌లౌతోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సామాజిక దూరం పాటించ‌డ‌మే స‌రైన ప‌ద్ధ‌తి. దీనితో ఎంతో ప్ర‌యోజ‌నం దేశానికి క‌లిగింది. ఆర్థిక‌ప‌రంగా చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది. కానీ భార‌తీయుల జీవితాల్ని కాప‌డ‌డానికి ఆర్థికంగా ఎంత న‌ష్టం వ‌చ్చినా ప‌ర్వాలేదు.

క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వాల‌ను వైద్యుల‌ను మొప్ప‌తిప్ప‌లు పెడుతోంది. భార‌త్‌లో కూడా క‌రోనాపై విజ‌యం ఎలా సాధించాలి. న‌ష్టాన్ని ఎలా త‌గ్గించాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ఎలా త‌గ్గించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంత‌రం చ‌ర్చ‌లు చేశాను. అంద‌రూ లాక్ డౌన్ పెంచాల‌నే సూచ‌న‌లు వ‌చ్చాయి. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పెంచుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.