పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరో 19 రోజులు లాక్‌డౌన్ పెంచుతున్నాం. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇదే ఐక్యమత్యం, స్పూర్తిని ప్రజలు చూపించి ఇళ్లకే పరిమితం కావాలని పి.ఎం. విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 20 వరకు పరిస్థితి తీవ్రంగా వుంటుంది. ఈ వారం రోజులు భారత్‌కు గడ్డు కాలం. ప్రజలంతా అప్రమత్తంగా వుండాలి. ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను ఉపయోగించండి. రోగనిరోధక శక్తి పెంచడానికి చర్యలు తీసుకోండి. ఆరోగ్య శేతు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పేద ప్రజల గురించి పట్టించుకోండి. వీలైనంత మందికి భోజనం పెట్టండి. ఎవరినీ ఉద్యోగాల నుంచి తీయకండి. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ నిబంధనల్ని పాటించి సురక్షితంగా ఉండండి.