English | Telugu

హమ్మో.. ఏపీలో కరోనా లెక్క ఝడిపిస్తోంది...

*ఏపీలో 502కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు
*గుంటూరు లో అత్యధికంగా 114 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహహ్మారి విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరుకుంది. 114 కేసులతో గుంటూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 96, నెల్లూరు జిల్లా 54 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.