English | Telugu
ఫీజు రీయింబర్స్ మెంట్ తల్లి అక్కౌంట్లోకే!
Updated : Apr 14, 2020
దీంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట చేకూరే అవకాశం ఉంది. 2018-19కి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీఎం తెలిపారు.
తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని కాలేజీలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెడతామని సి.ఎం. హెచ్చరించారు.