English | Telugu

నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వు!  కేటిఆర్‌

రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులను సూచించారు. మంత్రులు ప్రగతిభవన్‌లో కరోనా వైరస్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా, పూర్తిగా అన్ని రహదారులను మూసివేసి ఒకటే మార్గం పోలీసుల పహరలో తెరచి ఉంచాలి. ఏ ఒక్కరు బైటికి రాకుండా, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని కేటిఆర్ సూచించారు.
ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకుని, అనుమానితులను హాస్పిటల్ కు తరలించి కావలసిన వైద్య పరీక్షలు చేయించి positive రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించడంతో పాటు ట్రావెల్ హిస్టరీ వివరాలతో పాటు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి తదుపరి చర్యలు తీసుకోవాలని, పోలీస్, జిహెచ్ఎంసి మరియు మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు.

రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైనే రావొద్దని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఈటెల సూచించారు. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి సహా హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వైద్య ఆరోగ్య, పురపాలక, పోలీసు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.