English | Telugu
అమరావతిలో దళితుల భూములు స్వాహా.. చిక్కుల్లో టీడీపీ మాజీ మంత్రులు!!
Updated : Jan 23, 2020
ఓ వైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా తెల్లరేషన్ కార్డుదారుల భూములు కొన్న వ్యవహారం సంచలనం రేకెత్తిస్తుంటే మరో వైపు మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు నారాయణ పై సీఐడీ కేసు పెట్టడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తమను బెదిరించి భూములు లాక్కున్నారంటూ బుజ్జమ్మ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది సీఐడీ.
గుంటూరు జిల్లా , వెంకటపాలానికి చెందిన బుజ్జమ్మకు 90 సెంట్ల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని మాజీ మంత్రులు లాక్కున్నారని ఆరోపించింది బుజ్జమ్మ. ఆ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రులపై సక్షన్ 420,506,120/B కింద కేసు పెట్టింది సీఐడీ. మరోవైపు తన పై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ప్రత్తిపాటి పుల్లారావు. బెల్లంకొండ నరసింహారావు అనే వ్యక్తి ద్వారా బెదిరింపులకు పాల్పడి తమ వద్ద ఈ భూములను కొనుగోలు చేశారంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి కొన్ని కీలకమైన విషయాలు కూడా సేకరించినట్లు సమాచారం. అమరావతి పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి.. మొత్తం ఆరు మండలంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దళితులకు అండగా ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన భూములను బలవంతంగా బెదిరించి తీసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసు పెట్టడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.