English | Telugu

ఆట సందీప్, జ్యోతి పెర్ఫార్మెన్స్ "రోమాంచమ్" అన్న కంటెస్టెంట్స్


నీతోనే డాన్స్ ఈ వారం ప్రసారమైన ఆదివారం ఎపిసోడ్ లో ఆట సందీప్, జ్యోతి చేసిన అమేజింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక అమరదీప్ - తేజు వీళ్లకు 9 ఇచ్చారు. అమరదీప్ మాట్లాడుతూ "సందీప్ మీరు బాగా చేశారు కానీ వదిన డాన్స్ మాత్రం అంతగా అనిపించలేదు , ఎనర్జీ తగ్గిపోయింది.. లిరిక్స్ కూడా పడలేదు" అని చెప్పేసరికి. జ్యోతి, సందీప్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. "చూడండి మీరు కూడా కావాలంటే నన్ను అనుమానించొద్దు" అన్నాడు. "ఎనెర్జీ గురించి జ్యోతితో ఎవరూ మాట్లాడొద్దు..ప్లీజ్ " అన్నాడు సందీప్ "తను ఎప్పుడూ చెబుతూ ఉంటుంది తానొక మ్యారీడ్ లేడీ, ఒక బాబు ఉన్నా కూడా ఇంకా ఆమె డాన్స్ చేస్తూనే ఉంది.. నేను తన ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పిన ప్రతీసారి ఆమె ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. నేను ఇంకా ఎనెర్జీగా చేయాలంటూ తిడుతూనే ఉన్నా.. ఈ రోజు మాత్రం జ్యోతి నాకన్నా ఎనర్జిటిక్ గా చేసింది. ఇది మాత్రం నా అభిప్రాయం..నువ్వు 9 మార్క్స్ ఇచ్చినా కూడా నేను 10 మార్క్స్ గానే అనుకుంటా.. ఆమె చేయగలదు, చేస్తుంది.

ఈ వన్ మార్క్ కూడా నేను పట్టించుకోను" అని చెప్పాడు సందీప్. ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సాగర్ - దీప జోడి 10 మార్క్స్ ఇచ్చేసారు. ఫైనల్ లో శ్రీముఖి "గూస్ బంప్స్" అనే పదాన్ని మలయాళంలో ఎం అంటారు అని అడిగింది. గూస్ పింపుల్స్ అని చెప్పి అమరదీప్ రాధతో దెబ్బలు తిన్నాడు. "రోమాంచమ్" అని అంటారు. ఆ పేరుతో రీసెంట్ గా ఒక మూవీ కూడా వచ్చిందని గుర్తు చేశారు. నీతోనే డాన్స్ ప్రతీ వారం ఏదో ఒక టీమ్ మిగతా కంటెస్టెంట్స్ తో గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఈ వారం షోకి ప్రియాంక జైన్- శివ్ కుమార్ ఎంట్రీ ఇవ్వలేదు.. షో స్టార్టింగ్ లో ఈ విషయాన్నీ జడ్జెస్ కి చెప్పింది శ్రీముఖి. శివ్ కి ఫీవర్ వలన రాలేకపోయారని చెప్పింది.