English | Telugu

శ్రీహాన్, శ్రీసత్యల స్నేహాన్ని గుర్తుచేసుకుంటున్న రేవంత్!

బిగ్ బాస్ సీజన్-6 లో సింగర్ కేటగిరీలో వచ్చిన రేవంత్ తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజు నుండి తనకున్న ట్యాలెంట్ తో , తను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అదే విధంగా ఉన్నాడు. దాంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కంటెస్టెంట్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ లో రేవంత్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది.

ఎల్.వి. రేవంత్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేపథ్య గాయకుడు. పలు సినిమాల్లో 200 కి పైగా పాటలు పాడాడు. ఎం. ఎం. కీరవాణి , కోటి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించిన ప్రముఖ పోటీ.. ఇండియన్ ఐడల్-9 లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ నిలవగా.. నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో రేవంత్‌ విజేతగా నిలిచాడు.

తాజాగా బ్రో సినిమాలోని 'మై డియర్ మార్కండేయ' పాట పాడిన రేవంత్.. ఈ సాంగ్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్, శ్రీసత్యలతో తన బాండింగ్ ఎలా ఉందో మరోసారి చూసుకుంటున్నాడు రేవంత్. తన ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లో కలిసి ఉన్న ఒక వీడియోని అప్లోడ్ చేశాడు రేవంత్. ఆ వీడియోకి హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు రేవంత్. కాగా బ్రో సినిమా హిట్ అవడంతో రేవంత్ పాడిన పాటకి మంచి స్పందన వస్తుంది. మిస్టేక్ సినిమాలోని పిల్లా అనే సాంగ్ బాగుందంటూ , డోంట్ మిస్ ఇట్ అంటూ మరొకటి షేర్ చేసాడు రేవంత్. కాగా బిగ్ బాస్ సీజన్-6 లో శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.